top of page

🏛️ మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. మాట్లాడుతోన్న సభ్యులు

🏰 తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గవర్నర్ తమిళిసై నుంచి ఈ బిల్లుకు అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లును పంపి రెండు రోజులు గడిచినప్పటికీ, గవర్నర్‌ ఇంకా ఆమోదం తెలపలేరు. దీంతో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే గవర్నర్‌ తీరుపై ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. ఆదివారంలోపు అనుమతి ఇవ్వకపోతే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు..


 
 
bottom of page