top of page

🌉 మెట్రో బ్రిడ్జ్‌ల పైనుంచి నిర్మించిన మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జ్.. 🌉

SRDP ద్వారా పథకం ద్వారా మొత్తం 45 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 35 పూర్తి అయ్యాయి. ఇందిరా పార్కు నుండి వి.ఎస్.టి స్టీల్ బ్రిడ్జ్ 20వ ఫ్లై ఓవర్‌ను ఆగస్ట్ 19న ప్రారంభించనున్నారు.

ఇంతకు ముందు 19 ఫ్లై ఓవర్‌లు, 5 అండర్ పాస్‌లు, 7 ఆర్‌ఓ‌బి/ ఆర్‌యుబీలు, 1 కేబుల్ స్టయిడ్ బ్రిడ్జ్, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్, పంజాగుట్ట రోడ్‌వు వెడల్పు, పనులు పూర్తిగా అయ్యాయి. ఇందిరా పార్కు నుండి వీఎస్‌టీ వరకు చేపట్టిన ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జ్‌తో SRDP ద్వారా ఇప్పటి వరకు 36 పనులు పూర్తికాగా అందులో ఈ 20వ బ్రిడ్జ్ అందుబాటులోకి రానున్నది. మిగతా 12 పనులు 2023 డిసెంబర్ కల పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్‌లో SRDP ద్వారా రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టిన మొట్టమొదటి స్టీల్ ఫ్లై ఓవర్ ఇది. మిగతా ఫ్లై ఓవర్‌ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్‌తో ఫ్లై ఓవర్‌ను పూర్తి చేశారు. మొదటిసారిగా మెట్రో బ్రిడ్జ్‌పై నుండి ఫ్లై ఓవర్ నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌గ్రేటర్‌లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థతో పాటు సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంది. 🚆🛤️

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page