పల్లెటూరి ఊర మాస్ ‘నా సామిరంగ’టీజర్🎥🌟
- Suresh D
- Dec 17, 2023
- 1 min read
నాగార్జునను ఊర మాస్ పల్లెటూరి గెటప్ లో చూసి చాలా గ్యాప్ వచ్చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు తర్వాత పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. అందుకే గేరు మార్చి ఈసారి మళ్ళీ గ్రామం వైపు అడుగులు వేశాడు నాగ్. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న నా సామిరంగా సంక్రాంతి పండక్కు సిద్ధమవుతోంది. ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు కానీ అంత పోటీలోనూ వచ్చేందుకే నిర్ణయించుకుంది. ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. 🎥🌟



Comments