ఆ స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతోంది: వేణుస్వామి
- MediaFx

- Apr 23, 2024
- 1 min read
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ప్రభాస్ పై తనకేమీ ద్వేషం లేదంటూనే ఆయన గురించి వ్యతిరేకంగా జాతకం చెబుతుంటారు. రాజకీయ రంగంలోని ప్రముఖులకు, సినీ రంగంలోని ప్రముఖులకు జాతకాలు చెబుతూ ఆయన కూడా ఓ ప్రముఖుడిగా మారిపోయారు. సమంత విడాకులు తీసుకుంటుందని, కాపురం నిలవదని చెప్పిన విషయం నిజమవడంతో ఆయన ప్రముఖుల గురించి ఏమేం చెప్పాడా అంటూ నెటిజన్లు వీడియోలను శోధించి తెలుసుకుంటున్నారు. తాజాగా ఆయన ఒక వీడియోలో హీరోయిన్ విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. కలర్స్ స్వాతి ఒకసారి తన దగ్గరకు వచ్చి జాతకం చూపించుకుందని చెప్పారు. తర్వాత తాను వివాహ జీవతం ఎక్కువ కాలం నిలవదని, భర్తతో విడాకులు తీసుకుంటారని, విడిపోయే పరిస్థితి ఉందంటూ చెప్పానని, అయితే ఈ విషయంలో ఆమె తనను బాగా తిట్టి వెళ్లిపోయిందన్నారు. తాను చెప్పింది అర్థం చేసుకోకుండా స్వాతి అలా ప్రవర్తించిందని, తాను చెప్పినట్లే తర్వాత భర్తతో విడాకులు తీసుకుందన్నారు. ఈ విషయం తాను కావాలని చెప్పింది కాదని, ఆమె జాతకం అలా ఉందన్నారు.




Comments