top of page

🚓🛍️ఖైదీతో కలిసి షాపింగ్‌.. పోలీసులు సస్పెండ్‌ 😲💥

ఓ ఖైదీని వెంటబెట్టుకొని షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఘనకార్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రిషబ్‌ రాయ్‌ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో గత జూన్‌లో అరెస్టు చేసి జైలుకు పంపారు.

అతడికి అనారోగ్య సమస్యలు ఉండటంతో ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మార్చి 7న పోలీసులు ఖైదీని జైలు నుంచి దవాఖానకు తీసుకెళ్లారు.

తిరిగి జైలుకు వెళ్లే దారిలో ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద పోలీసు వాహనాన్ని ఆపి ఖైదీని తీసుకొని లోపలికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో ఎస్సై రామ్‌సేవక్‌ సహా ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. 🏢🚔

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page