🎥 శివన్న ఉగ్రరూపం.. ఫుల్ యాక్షన్‌తో ‘ఘోస్ట్’ ట్రైలర్
- Suresh D
- Oct 2, 2023
- 1 min read
కన్నడతోపాటు తెలుగులోనూ గుర్తింపు ఉన్న హీరో శివరాజ్ కుమార్. ఈ మధ్య రజనీకాంత్ ‘జైలర్’ లో చిన్న పాత్రలో కనిపించినా తెలుగు ప్రేక్షకులు ఆయనను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ‘ఘోస్ట్’ సినిమాతో పూర్తిస్థాయి తెలుగు సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ కు మంచి స్పందన లభించింది. శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివన్న మాస్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా చిత్రం బృందం ట్రైలర్‌ను రిలీజ్ చేపింది. ‘సామ్రాజ్యాలు సృష్టించే వాడిని చరిత్ర మర్చిపోతుందేమో కానీ.. విధ్వంసం సృష్టించిన వాడిని ఎప్పుడూ మర్చిపోదంటూ’ అనే డైలాగ్ తో సినిమా ఎలా ఉండబోతుందనే హింట్ ఇచ్చారు.🎬🔥