కలలో ఈ ఐదు వస్తువులు కనిపిస్తే మంచి రాబోతున్నాయని అర్ధం..
- MediaFx

- Aug 24, 2024
- 1 min read
గుడ్లగూబ: గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. లక్ష్మీదేవి సంపదకు దేవతగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఎవరి కలలోనైనా గుడ్లగూబను చూసినట్లయితే వారు జీవితంలో ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందని.. లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదం వారిపై ఉంటుందని అర్థం చేసుకోవాలి. స్వప్న శాస్త్రంలో గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
పాము: కలలో పాము కనిపిస్తే అశుభం అని చాలా మందికి అపోహ ఉంది. అయితే అది అస్సలు నిజం కాదు. పామును చూడటం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి కలలోనైనా పాము కనిపిస్తే అది ఏ స్థితిలో, ప్రదేశంలో ఉందో అన్నదానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎవరి కలలోనైనా కలుగు చుట్టూ ఉన్నట్లు పాము కనిపించినట్లయితే.. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. అది డబ్బు రావడానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది.
గరుడ పక్షి: గరుత్మంతుడు ఈ జగత్తును పోషించే విష్ణువు వాహనంగా పరిగణించబడుతున్నాడు. ఎవరి కలోనైనా ఎప్పుడైనా గరుడుడి కనిపిస్తే విష్ణువు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. కలలో గరుడ దేవుడిని చూస్తే త్వరలో జీవితంలో ధనవంతులు అవుతారని నమ్ముతారు.
బంగారం: కలలో బంగారం కనిపిస్తే కొన్ని సమస్యలు పరిష్కరించబడుతున్నాయని అర్థం చేసుకోండి. అంతేకాదు కలలో బంగారాన్ని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ జీవితంలోకి లక్ష్మీదేవి రాకగా చిహ్నంగా భావిస్తారు. కలలో బంగారం కనిపిస్తే ఇంట్లో త్వరలో కనక వర్షం కురుస్తుందని నమ్ముతారు.
దీపం: హిందూ మతంలో దీపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొంత మంది రోజూ పూజ గదిలో, పండుగ సమయంలో ఖచ్చితంగా దీపం వెలిగిస్తారు. ఎవరి కలలోనైనా వెలుగుతున్న దీపం కనిపిస్తే, అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. సదరు వ్యక్తికి మంచి రోజులు రానున్నాయని.. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్య నుండి బయటపడగలడని నమ్మకం.












































