top of page

అమెజాన్‌లో రూ.30 వేలకే సామ్‌సంగ్ ఎస్ 23 ఫోన్..📱🔥


ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు కూడా ఎక్కువగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్‌లోనే కొంటున్నారు. తాజాగా ప్రముఖ సామ్‌సంగ్ ఫోన్ అయిన  సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ ఏఐ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 69,999 తగ్గింపు ధరతో అందించబడుతోంది. దీని అసలు ధర రూ. 89,999 కాగా 27 శాతం తగ్గింపుతో ఈ ఆకర్షణీయమైన డీల్‌‌ను పొందవచ్చు.  అమెజాన్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5 జీ ఏఐ స్మార్ట్ ఫోన్ 8 జీబీ+256 జీబీ వేరియంట్‌లో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అంటే కేవలం రూ.30 వేలకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ ఆఫర్ ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.

అమెజాన్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ. 9,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంటే కేవలం రూ.60,999 కే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ. 31,550 వరకూ పొందవచ్చు. అంటే కేవలం ధర రూ. 29,449కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి లావాదేవీ చేసినప్పుడు రూ. 9,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. కనీస కొనుగోలు విలువ రూ. 25,000 కూడా పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును ఉపయోగించి 3, 6, 9, 12, 18, లేదా 24 నెలల ఈఎంఐ ప్లాన్లను ఎంచుకున్నప్పుడు కస్టమర్లు మరో రూ. 9,000 ఫ్లాట్ తగ్గింపును పొందే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల పై కనిష్టంగా రూ. 25,000 కొనుగోలు చేస్తే రూ. 9,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. 


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page