ఫుల్ యాక్షన్ తో సల్మాన్ ‘టైగర్ 3’ టీజర్
- Suresh D
- Sep 27, 2023
- 1 min read
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా 'టైగర్ 3' అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు స్నీక్ పీక్‌తో ఉత్సాహాన్ని నింపాడు. యాక్షన్-థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించగా.. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. నవంబర్ 10న , 2023 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ మరియు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ రోజుహీరో సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సినిమా థ్రిల్లింగ్ టీజర్‌ను విడుదల చేసి.. సినిమాలో ఉన్న తన పాత్ర గురించి మరింత ఆసక్తి పెంచాడు.