top of page

కల్కి సినిమాలో కృష్ణుడి పాత్ర చేసింది అతడే..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో కొన్ని పాత్రలకు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అందులో కృష్ణుడు పాత్ర ఒకటి. ఈ పాత్రలో ఎవరు నటించారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

అయితే ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో నటించింది కృష్ణ కుమార్. ఈ నటుడు ఇంతకుముందు చాలా మంచి పాత్రల్లో నటించారు. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అతని నటనకు వస్తున్న ప్రశంసల పట్ల అతను సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్కి చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టడం మాత్రమే కాకుండా, ఎన్నో రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page