top of page

సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' మూవీ

మాస్ మహారాజా రవితేజ , తెలుగు చిత్రసీమలో వరుస సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్! 'ధమాకా' ఈ కలయికలో వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థలో రవితేజ మరో సినిమా చేస్తున్నారు. అది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

'ధమాకా' వంటి బ్లాక్‌ బస్టర్ తర్వాత రవితేజ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'ఈగల్' . టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. దీని కంటే ముందు నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఆయన 'సూర్య వర్సెస్ సూర్య' చేశారు.

'ఈగల్' సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ఇవాళ ఆ మాటను మరోసారి చెప్పింది. అంతే కాదు... 'మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు' అంటూ విడుదల తేదీ కూడా వెల్లడించింది. జనవరి 13న థియేటర్లలోకి సినిమాను తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేసింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page