top of page

ట్విట్టర్‌లో రవితేజ ఫ్యాన్స్ ఎమోషనల్..

Ravi Teja Ravanasura OTT మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాడు. రావణాసుర సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో రవితేజ విలన్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ద్వితీయార్థం వచ్చే సరికి సగటు హీరోలా మారుతాడు.

Ravi Teja Ravanasura OTT : రావణాసుర మూవీ బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా.. నీ యాక్టింగ్‌తో ఫుల్ శాటిస్‌ఫై అయిపోయా అన్నా అంటూ రవితేజ ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు. అమర్ అక్బర్ ఆంటోని, రావణాసుర, డిస్కో రాజా ఇలా ప్రతీ సారి ప్రయోగాలు చేస్తూనే ఉన్నా.. జనాలు మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతోన్నారు.. వాటికంటే మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు చేస్తేనే ఆదరిస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లో అంతగా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ధమాకా, వాల్తేరు వీరయ్య తరువాత హ్యాట్రిక్ కొడతాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. రావణాసుర సినిమాతో మళ్లీ ఫ్లాపుల పరంపర మొదలయ్యేలా ఉందని అంతా అనుకుంటున్నారు. రవితేజ మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూనే పోతోన్నాడు.రావణాసుర ఫలితం మీద కూడా రవితేజ ఫన్నీగానే రియాక్ట్ అయ్యాడట. ఓహో సినిమా పోయిందా? అని చిన్నగా నవ్వేశాడట. అలా రవితేజ తన సినిమాల ఫలితాల గురించి ఎక్కడా కూడా స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. రవితేజ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అంటూ మరో ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రేణూ దేశాయ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హేమలతా లవణం అనే కారెక్టర్‌లో రేణూదేశాయ్ కనిపించనుంది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page