‘యానిమల్’ రక్తపాతం మొదలు... టీజర్ తోనే హీట్ పెంచిన రణబీర్
- Suresh D
- Sep 28, 2023
- 1 min read
అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్ ను షేక్ చేసిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను కబీర్ సింగ్ పేరిట హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ ను కూడా మెప్పించాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ ప్యాన్ ఇండియా చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ తోపాటు, రీసెంట్ గా విడుదల చేసిన అనిల్ కపూర్, మంధాన, బాబీ డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ రోజు రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.