top of page

రజినీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో క్యామియో..

Updated: Apr 24, 2024


సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందబోయే భారీ చిత్రం తాలూకు అప్డేట్స్ ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇవ్వడం లేదు. హీరోయిజంకి గూస్ బంప్స్ తేవడంలో కొత్త డెఫినేషన్లు రాస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో తలైవర్ ఏ రేంజ్ లో కనిపిస్తాడోని అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. 80 దశకంలో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న లోకేష్ ఈసారి రజని క్యారెక్టరైజేషన్ పరంగా ఇప్పటిదాకా ఎవరూ చూపించని తరహాలో చాలా ప్రయోగాలు చేయబోతున్నాడట. అసలు పాయింట్ కు వస్తే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం కింగ్ నాగార్జునని సంప్రదించినట్టు తెలిసింది. ప్రాధమికంగా చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందట. మల్టీస్టారర్స్ చేసేందుకు ఈ మధ్య కాలంలో నాగ్ ఆసక్తి చూపిస్తున్నారు. ధనుష్ కుబేరలో ఆల్రెడీ నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ఎంతో అవసరమైతే తప్ప ఇలాంటి స్టార్ కలయికను సెట్ చేసుకోరు. సో అల్లుడు తర్వాత ఇప్పుడు మామ కాంబోకి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన లాంటివేం రాలేదు కానీ సోర్స్ అయితే బలంగా వినిపిస్తోంది. రజని, నాగ్ లు కలిసి నటిస్తే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. గతంలో ఈ ఇద్దరూ ఒకే కథతో 1991లో శాంతి క్రాంతిలో నటించారు. తెలుగులో నాగ్, తమిళంలో రజనీకాంత్ చేశారు. కలిసి స్క్రీన్ ని పంచుకునే ఛాన్స్ దక్కలేదు. ఇన్నేళ్లకు అది సాధ్యమైతే ఫ్యాన్స్ కి స్పెషల్ న్యూస్ అవుతుంది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page