top of page

పుతిన్‌ బహుమతులు.. కిమ్‌కు గిఫ్ట్‌గా అరుదైన గుర్రాలు


ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న ఉత్తర కొరియాకు పుతిన్‌ బహుమతులు పంపుతున్నారు. ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు అత్యంత ఇష్టమైన 24 గుర్రాలను పుతిన్‌ అందజేశారని ‘ద టైమ్స్‌’ కథనం తాజాగా పేర్కొన్నది. కిమ్‌ బాగా ఇష్టపడే ఒర్లావో ట్రోటర్‌ జాతి గుర్రాల్ని పుతిన్‌ తెప్పించారట. రెండేండ్ల క్రితం 30 ఒర్లావో ట్రోటర్‌ గుర్రాల్ని కిమ్‌కు అందజేయగా, వాటిపై స్వారీ చేస్తూ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తెగ మురిసిపోయారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరిన క్రమంలో ఇరు దేశాల అధినేతలు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారని తెలిపింది. కిమ్‌ ఈ ఏడాది జూన్‌లో పుతిన్‌కు అరుదైన శునకాల్ని బహుమతిగా పంపగా, పుతిన్‌ ఆగస్టులో కిమ్‌కు 447 మేకల్ని పంపారట.




 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page