top of page

యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్..🌟


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా పుష్ప పుష్ప అంటూ సాగే పాటను రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.ఈ పాట ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లో 45 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. అదే విధంగా 1.5 మిలియన్స్ లైక్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం 15 దేశాల్లో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఫాహాద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page