top of page

'హైదరాబాద్‌ బాలికను ప్రశంసించిన ప్రధాని నరేంద్రమోడీ.. 👏

చిన్న వయసులోనే సమాజానికి తన వంతు కృషి చేస్తున్నందుకు ఆకర్షణ సతీష్‌ను ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా అభినందించారు. ‘‘ఆకర్షణ సతీశ్ చదవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఆకర్షణ సతీశ్ కృషికి నా అభినందనలు. ఆకర్షణను చూసి గర్విస్తున్నాను’’ అంటూ చిన్నారి ప్రయత్నాన్ని మోడీ అభినందించారు. 👍👦🌱

గతంలో ఆకర్షణ ప్రయత్నాన్ని మెచ్చిన రాష్ట్రపతి కూడా ప్రశంసించారు. 🌟 అంతేకాకుండా ఆకర్షణ లైబ్రరీలను ఏర్పాటు చేయడంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్, అదనపు డీజీపీలు స్వాతి లక్రా, శిఖా గోయెల్‌ సహా పలువురు ఉన్నతాధికారుల ప్రశంసించారు. 👮‍♂️📚

ఆకర్షణ తన తల్లిదండ్రులతో కలిసి ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిని సందర్శించినప్పుడు.. ఆసుపత్రిలోని చిన్నారుల కోసం లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అన్నదానం చేస్తున్న క్రమంలో ఆసుప్రతిలోని పిల్లలు ఆమెను కలర్ పుస్తకాలు కావాలని అడగడంతో.. అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. 📖 ఆసుపత్రిలోని పిల్లలకు పుస్తకాలు అందించాలన్న సంకల్పంతో ఇరుగుపొరుగు వారి నుంచి, బంధువుల నుంచి పుస్తకాలు సేకరించి తొలి లైబ్రరీని హాస్పిటల్ లో ఏర్పాటు చేసింది. 🏥 ఆమె ఒక సంవత్సరం పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో 1,036 పుస్తకాలను సేకరించి.. అనంతరం లైబ్రరీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. విద్యార్థిని వివిధ ప్రదేశాలలో పిల్లల కోసం మరో ఆరు లైబ్రరీలను ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తోంది. 📚📚👩‍🎓👨‍🎓

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page