ధర రూ.6999 కే, 50MP కెమెరా తో Motorola ఫోన్! సేల్ వివరాలు..
- MediaFx
- Jul 18, 2024
- 1 min read
Motorola G04S స్పెసిఫికేషన్ల వివరాలు: ఈ Motorola G04S స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఈ ఫోన్ డిస్‌ప్లే 1612 x 720 పిక్సెల్స్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మరియు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది, ఇది ఉపయోగించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మోటోరోలా G04S స్మార్ట్‌ఫోన్ LED ఫ్లాష్ సపోర్ట్‌తో 50MP సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది. కాబట్టి మీరు ఈ స్మార్ట్‌ఫోన్ సహాయంతో ఖచ్చితమైన ఫోటోలు మరియు వీడియోలను తీసుకోవచ్చు. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 5MP కెమెరా కూడా ఉంది. యూనిసోక్ T606 SoC ప్రాసెసర్ తో ఈ మోటోరోలా G04S ఫోన్ లాంచ్ చేయబడింది. ముఖ్యంగా ఈ చిప్‌సెట్ మెరుగైన వేగం మరియు పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ Mali G57 GPUని కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి గేమింగ్ యూజర్లు ఈ ఫోన్ ను నమ్మకంగా కొనుగోలు చేయవచ్చు.ఈ మోటోరోలా G04S స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా My UX ద్వారా అందించబడుతుంది. అయితే, ఫోన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుంది. మోటరోలా ఈ ఫోన్ డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మోటోరోలా G04S స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మాస్ సౌండ్‌ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తుంది. మరియు ఈ అద్భుతమైన మోటోరోలా ఫోన్ దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధకత కోసం IP52 రేటింగ్‌ను పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ స్టోరేజీ విస్తరణకు కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ మద్దతును కలిగి ఉంది. అంటే మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ సపోర్ట్ ఉంది. ఈ మోటోరోలా G04S ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కాబట్టి ఈ ఫోన్ లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇందులో 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌కు కూడా మద్దతు ఇస్తుంది.