top of page

తల్లైన బిగ్ బాస్ బ్యూటీ.. అప్పుడే పేరు పెట్టేసిన సార్పట్ట విలన్..

పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. తన బిడ్డను చూసుకుని జాన్ కొక్కెన్ మురిసిపోతోన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆ బిడ్డకు పేరు కూడా పెట్టేశాడు.

Pooja Ramachandran Blessed With Baby Boy : బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్, సార్పట్ట విలన్‌లు గత కొన్ని రోజులుగా సంతోషంలో మునిగిపోతూ వచ్చారు. పూజా రామచంద్రన్ తన బేబీ బంప్‌తో రకరకాల ఫోటో షూట్లు చేసిన సంగతి తెలిసింది. తాను తండ్రిని అయినట్టుగా జాన్ కొక్కెన్ ప్రకటించాడు. పూజా రామచంద్రన్‌కు పండంటి మగ బిడ్డ పుట్టాడు. అప్పుడే ఆ బిడ్డకు పేరు కూడా పెట్టారు. కియాన్ కొక్కెన్ అంటూ పేరు పెట్టినట్టుగా జాన్ కొక్కెన్ ప్రకటించాడు.

బిగ్ బాస్ రెండో సీజన్‌లో పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డ్‌గా వచ్చి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మగ కంటెస్టెంట్లకు ధీటుగా టాస్కులు ఆడి బాగానే గెలిచింది. ఇంట్లోకి వచ్చిన మొదట్లో కౌశల్‌కు సన్నిహితంగానే ఉంది. ఆ తరువాత కౌశల్‌కు వ్యతిరేకంగా మారింది. దీంతో కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.
























పూజా రామచంద్రన్ ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. నటుడు జాన్ కొక్కెన్‌తో పెళ్లి తరువాత పూజా రామచంద్రన్ లైఫ్ కాస్త ప్రశాంతంగానే సాగినట్టు అనిపిస్తోంది. పూజా రామచంద్రన్, జాన్ కొక్కెన్‌లు వేసే వెకేషన్లు, షేర్ చేసే ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఇక గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతోన్న సంగతిని సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నారు.




 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page