top of page

🕍📸 అయోధ్య రామాలయం ముంగిట పవన్ కల్యాణ్ సెల్ఫీ వైరల్

5️⃣0️⃣0️⃣ ఏళ్ల కల సాకారం చేస్తూ అయోధ్యలో రాముడు కొలువు దీరాడు. కొత్త‌గా నిర్మించిన ఆల‌యంలో సోమవారం (జనవరి 22) బాలరాముడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు.

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు పూర్తయ్యింది. అనంతరం శ్రీరామ మందిరంలో శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. అంగరంగ వైభవంగా జరిగిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ దంపతులు కూడా ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమయ్యారు. ఇక జనసేన అధిపతి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అయోధ్య రామోత్సవంలో స్పెషల్‌ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం ముందు తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు పవన్‌ కల్యాణ్‌. ‘రామ కార్యం అంటే రాజ్యకార్యం.. ప్రజాకార్యం.. జై శ్రీరామ్‌’ అని తన దైన శైలిలో క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం పవన్‌ సెల్ఫీ నెట్టింట తెగ వైరలవుతోంది. అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, నెటిజన్లు జై శ్రీరామ్‌ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page