PKSDT: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
- harikrishna
- May 17, 2023
- 1 min read
Updated: May 17, 2023
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ జంటగా నటిస్తున్న పీకేఎస్డీటీ గురించి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రం తమిళ సినిమా వినోదయ సీతమ్ కు రీమేక్. అయితే పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో పవన్ కనిపించ బోతుండగా.. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా ఈ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నాడు.
ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. అలాగే ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ సరసన రొమాంటిక్ కథానాయిక కేతికా శర్మ నటించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి

అదేంటంటే.. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం (మే 18వ తేదీ) 4.14 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అప్పటి వరకూ వేచి చూడండంటూ రాసుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి 'బ్రో' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ అంతా ఇదే టైటిల్ ఉండే అకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు.
రేపు సాయంత్ర వరకు ఆగితే ఈ సినిమా పేరేంటో తెలిసిపోతుంది. అలాగే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నారో కూడా అర్థం అయిపోతుంది. కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. అయితే ఆయన ఈ సినిమా కోసం దాదాపుగా 50 కోట్ల వరక పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా రోజుకు రెండు కోట్లు తీసుకున్నారట. జూలై 28వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు కనిపపించబోతున్నారు.



Comments