top of page

ఫ్యాన్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబుల్ ట్రీట్..

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు హరీష్ శంకర్. ఈక్రమంలో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ స్పెషల్ లుకు ను ఈ ఈ సినిమా నుంచి రిలీజ్ చేశారు టీమ్..

పాలిటిక్స్ కు కాస్త గ్యాప్ ఇంచ్చి సినిమాలు కంప్లీట్ చేసేపనిలో పడ్డాడు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. ఇందులో భాగంగా.. చాలా కాలంగా వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ కు సాలిడ్ గా టైమ్ కేటాయించాడు. ఇక ఉన్న సమయాన్ని...యూస్ చేసుకోవడంతో హరీష్ శంకర్ దిట్ట.. ఈ టైమ్ గ్యాప్ లోనే ఉస్తాద్ షూటింగ్ ను పరుగులు పెట్టించి.. పవర్ స్టార్ కు సబంధించిన మేజర్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. అంతే కాదు ఉస్తాద్ నుంచి పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశాడు హరీష్ శంకర్. అంతే కాదు ఈమూవీ నుంచి ఫ్యాన్స్ కు డబుట్ ట్రీట్ దొరకబోతున్నట్టు తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ని ఈరోజు(11 మే) సాయంత్రం 4.59 కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ని మరింత జోష్ లో నింపడానికి తాజాగా సర్ ప్రైజ్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page