గూగుల్ మ్యాప్స్‌తో ఇక ఆ సమస్య ఉండదు..
- MediaFx
- Jul 26, 2024
- 1 min read
గూగుల్ మ్యాప్స్‌లో 'న్యారో రోడ్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ ఫీచర్ ఇరుకు రోడ్లను గుర్తిస్తుంది. ప్రయణిస్తున్న సమయంలో ఇరుకు రోడ్లు ఉంటే వెంటనే న్యారో రోడ్ ఉందని అలర్ట్ చేస్తుంది. దీంతో మీరు ఫోర్ వీలర్ ఉపయోగిస్తుంటే వెంటనే ఇతర మార్గాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
ఇక ఫ్లై ఓవర్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సాధారణంగా మార్గ మధ్యంలో ఫ్లైఓవర్ వస్తే పైకి ఎక్కాలా.? కింది నుంచి వెళ్లాలా అనే సందేహం వస్తుంది. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్ పరిష్కరించింది. ఇప్పుడు మ్యాప్స్‌లో ఫ్లైఓవర్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి.
మార్గ మధ్యంలో ఫ్లైఓవర్ వస్తే వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది. ఒకవేళ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లాల్సి ఉంటే. టేక్ ఫ్లై ఓవర్ అనే సూచిక కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ దేశంలోని 40 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చేసింది.
ఇక మ్యాప్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మ్యాప్స్‌లో మెట్రో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను కొచ్చి, చెన్నై మెట్రోలో అందుబాటులోకి తీసుకొచ్చారు త్వరలోనే ఇతర నగరాల్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే వారి కోసం గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో మ్యాప్స్‌లో ఈవీ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మ్యాప్స్‌లో ఛార్జింగ్ స్టేషన్స్‌తో పాటు, ఎలాంటి పోర్ట్స్ అందుబాటులో ఉంటాయన్న వివరాలు తెలుసుకోవచ్చు.