top of page

నంద్యాలలో వైసీపీ శిల్పా రవి ఓటమి అల్లు అర్జున్‌పై ట్రోలింగ్

నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి ఓడిపోయారు. తన స్నేహితుడు రవి కోసం నంద్యాల వెళ్ళి బన్నీ చేసిన సందడి అందరికీ తెలుసు. తన ఫ్రెండ్ కోసం వచ్చానని బన్నీ చెప్పినా, మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయగా, బన్నీ తన స్నేహితుడు శిల్పా రవికి సపోర్ట్ చేశాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడంతో పాటు జన సేన పార్టీ 21 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు సాధించబోతోంది. కానీ బన్నీ సపోర్ట్ చేసిన శిల్పా రవి ఓడిపోవడంతో బన్నీపై ట్రోలింగ్ పెరిగింది. ఫ్యామిలీ కోసం రామ్ చరణ్ నిలబడ్డాడని, కానీ బన్నీ వైసీపీ కోసం నంద్యాలకు వెళ్లాడని, ఇంకా బన్నీ పిలుపు ఇచ్చినా శిల్పా రవి గెలవలేకపోయాడని సెటైర్లు వేస్తున్నారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page