top of page

సూపర్ స్టైలిష్‌ లుక్‌లో నందమూరి మోక్షజ్ఞ.. ప్రశాంత్‌ వర్మ అనౌన్స్‌మెంట్‌ అదిరింది


మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. లుక్‌ టెస్ట్‌ పూర్తి చేసిన తర్వాత మోక్షజ్ఞ సూపర్ స్టైలిష్‌ లుక్‌ను విడుదల చేశారు. జీన్స్‌ అండ్ బ్లాక్ హుడీ వేసుకొని సూపర్ చామింగ్‌ లుక్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటో నెట్టింటిని షేక్ చేస్తోంది. ప్రశాంత్‌ వర్మ లాంఛింగ్‌ టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయేలా గ్రాండ్‌గా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. తొలి సినిమాలోనే సూపర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ అభిమానులను ఇంప్రెస్ చేయడం పక్కా అని తాజా స్టిల్‌తో చెప్పకనే చెబుతున్నాడు.

ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నట్టు లెజెండ్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. భారత ఇతిహాసం ఆధారంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ (PVCU)లో ఉండబోతున్నట్టు సమాచారం. మోక్షజ్ఞ ఈ సోషియా ఫాంటసీ సినిమా కోసం అవసరమైన అన్ని రకాల శిక్షణలు పూర్తి చేసుకున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page