నాగార్జున ‘నా సామిరంగ’ ట్రైలర్ రిలీజ్.. ఎంటర్‌టైన్‍మెంట్, మాస్ యాక్షన్🎥✨
- Suresh D
- Jan 9, 2024
- 1 min read
కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగ’ చిత్రంపై మంచి హైప్ ఉంది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఎంటర్‌టైనింగ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం వస్తోంది. విజయ్ బిన్నీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండుగకు సరిగ్గా సూటయ్యే చిత్రం ఇదే అంటూ మూవీ టీమ్ ప్రమోషన్లను చేస్తోంది. యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కూడా నా సామిరంగ చిత్రంలో కీలకపాత్రలు చేశారు. జనవరి 14వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. నా సామిరంగ ట్రైలర్‌ను మూవీ టీమ్ నేడు (జనవరి 9) రిలీజ్ చేసింది.🎥✨