top of page

నా నెక్ట్స్‌ సినిమాకు పిల్లలు దూరంగా ఉండాలి.. నాని కామెంట్స్ వైరల్


టాలీవుడ్ యాక్టర్‌ నాని (Nani) నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదల కాగా.. పాజిటివ్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. నాని అభిమానులకు కావాల్సిన వినోదాన్ని పంచుతోంది. ప్రత్యేకించి ఎస్‌జే సూర్య కామిక్‌ టైమింగ్‌ను మూవీ లవర్స్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో నాని చెప్పిన మాటలు అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది. దసరా చిత్రంలో తలలు నరికే సన్నివేశాలు ఉన్నందున పిల్లలను సినిమాకి తీసుకెళ్లవచ్చా అని ఆలోచించా. సరిపోదా శనివారం సినిమాకు అలాంటి సమస్యే లేదు. ఇందులో హింస ఉంది కానీ అది అందరూ చూసేలా ఉంటుంది. కానీ నా తదుపరి చిత్రానికి మాత్రం పిల్లలు దూరంగా ఉండాలి.

ఇది చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ నెట్టింట రౌండప్ చేస్తుండగా.. ఇంతకీ నాని చెప్పింది శ్రీకాంత్‌ ఓదెల సినిమా గురించా..? శైలేష్‌ కొలను మూవీ గురించా.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మొత్తానికి తాను నటిస్తున్న తర్వాత సినిమాలో దసరాను మించిన వయొలెన్స్‌ ఉండబోతుందని చెప్పకనే చెప్పి క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు నాని.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page