top of page

మన ఎంపీలు అందుకునే జీతభత్యాలు ఎంతంటే..!

దేశవ్యాప్తంగా జరిగిన 543 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోక్ సభకు ఎన్నికైన ఎంపీలకు ప్రభుత్వం నుంచి అందే జీతం, ఇతరత్రా ప్రయోజనాలు ఏమిటంటే:

జీతం మరియు ఇతర ప్రయోజనాలు:

  1. జీతం: నెలకు ₹1 లక్ష

  2. నియోజకవర్గ ఖర్చులు: నెలకు ₹70 వేలు

  3. ఆఫీస్ నిర్వహణ: నెలకు ₹60 వేలు

  4. పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే డీఏ: రోజుకు ₹2 వేలు

  5. విమాన ప్రయాణం: ఎంపీ తన భాగస్వామితో కలిసి ఏడాదికి 34 సార్లు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు

  6. రైలులో ఫస్ట్ క్లాస్ ప్రయాణం: వ్యక్తిగత, అధికారిక పనులకు

  7. నియోజకవర్గంలో పర్యటించినపుడు టీఏ: క్లెయిమ్ చేసుకోవచ్చు

  8. ఉచిత వసతి సౌకర్యం: పదవీకాలం పూర్తయ్యే వరకు.. లేదా వసతి కోసం నెలకు ₹2 లక్షలు

  9. ఉచిత వైద్య సదుపాయం: ఎంపీ కుటుంబానికి

  10. పెన్షన్: పదవీకాలం పూర్తయ్యాక నెలకు ₹25 వేలు, ఒక్కసారి కంటే ఎక్కువ పర్యాయాలు ఎంపీగా సేవలందిస్తే, పింఛన్ ఏటా ₹2 వేల చొప్పున పెంపు

  11. ఉచిత ఫోన్ కాల్స్: ఏటా 1.5 లక్షల కాల్స్ చేసుకోవచ్చు

  12. హైస్పీడ్ ఇంటర్నెట్ మరియు విద్యుత్: 50 వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవచ్చు


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page