సంఘ్ పరివార్…ఇన్ని పచ్చి అబద్ధాల ? 😡
- Tatipaka Premchand
- Jun 2, 2023
- 1 min read

జవహర్ లాల్ నెహ్రూకు తిరువాదుతురై అధీనం కానుకగా ఇచ్చిన సెంగోల్ గురించి ప్రతి ఒక్క అబద్ధాన్నీ అనేక పత్రికలు, ఛానళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా ది హిందూ దినపత్రిక పటాపంచలు చేసి వాస్తవాలు బైట పెట్టినాక, సంఘ్ పరివార్ అబద్ధాల ఫాక్టరీ, వాట్సప్ యూనివర్సిటీకి మరొక అబద్ధం కల్పించవలసిన అవసరం వచ్చింది. ది హిందూ 1947 ఆగస్ట్ 29న మొదటి పేజీ అంతా అధీనం మఠాధిపతి, సెంగోల్, అది నెహ్రూకు ఇవ్వడం ఫోటోలతో నిండి వచ్చిందని, ఇప్పుడు హిందూ ఏమంటుందని సవాల్ చేస్తూ ఒక ఫోటోషాప్ ఫోర్జరీ పేజీ తయారుచేసి ట్విట్టర్ మీద ప్రవేశపెట్టారు. అది ఫేస్ బుక్ మీద, వాట్సప్ మీద చక్కర్లు కొడుతోంది.
నేను కూడా ఆశ్చర్యపోయి ది హిందూలో పనిచేసే ఒక జర్నలిస్టు మిత్రుడిని అడిగితే, ఆయన స్వయంగా ది హిందూ ఎడిటోరియల్ డైరెక్టర్ మాలినీ పార్థసారథి గారు ఇచ్చిన క్లారిఫికేషన్, ఆ రోజటి హిందూ మొదటి పేజీ, మరొక పేజీ పంపారు.
ఆ మరొక పేజీ (మొదటి పేజీ కాదు, పదో పేజీ!!) లో అధీనం వారు ఇచ్చిన వ్యాపార ప్రకటన (అడ్వర్టైజ్మెంట్) రూపంలో ఆ మూడు ఫోటోలు వచ్చాయి. అంటే పదిహేను రోజుల తర్వాత అధీనం తన గొప్పలు చెప్పుకోవడానికి ది హిందూ దినపత్రికలో ఒక పావు పేజీ కన్నా తక్కువ స్థలం కొనుక్కున్నదన్నమాట!!!! ఆ పదో పేజీ పావు పేజీ కన్నా తక్కువ అడ్వర్టైజ్మెంటు ను మొదటి పేజీ సచిత్ర వార్త గా ప్రచారం లో పెట్టడం ఆర్ ఎస్ ఎస్ కు సహజమైన అబద్ధాల తయారీకి నిదర్శనం!!

