top of page

వైరల్‌ ఫీవర్‌ నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్‌.. మూడు వారాల తర్వాత పూర్తి ఆరోగ్యంతో.. 😷🏥

సీఎం కేసీఆర్‌ పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కనిపిస్తున్నారు.మూడు వారాలుగా వైరల్‌ ఫీవర్‌ ఆతర్వాత చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడిన ఆయన.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.

సీఎం కేసీఆర్‌ పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కనిపిస్తున్నారు. 😊🌡️ మూడు వారాలుగా వైరల్‌ ఫీవర్‌ ఆతర్వాత చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడిన ఆయన.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. 😷🏨 కొన్ని రోజుల ముందే ఆయన కోలుకున్నా.. బలహీనత వల్ల బయటకు రాలేదు. 🙁 కేటీఆర్‌, హరీష్‌ రావుతో సమావేశమైన ఆయన తన క్యాంపేన్‌పై వారితో చర్చించారు. తనకు అనారోగ్యం ఉన్నా.. పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించినట్లు వీరు తెలిపారు. 👥 గత నెలలోనే కేసీఆర్‌కు వైరల్‌ ఫీవర్‌ సోకింది. 😷 అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించింది. 😞 ఆ విషయాన్ని కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కాని ఆయన కోలుకుంటున్నట్లు వారికి సమాచారం ఇచ్చారు. అయితే.. వైరల్‌ ఫీవర్‌ కారణంగా సెకండ్‌ గ్రేడ్‌ చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌ కూడా రావడంతో.. ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగింది. 🩺 మూడు వారాల తర్వాత నిన్న ఆయన పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాలమూరు ప్రోగ్రెస్‌రిపోర్ట్‌ను కేసీఆర్‌కు అందించిన సందర్భంగా ఈ ఫొటో తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తల్లి చనిపోవడంతో.. ఈరోజు ఆయన నిజామాబాద్‌ వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈనెల 16 నుంచి ఆయన ఎన్నికల క్యాంపేన్‌కు సిద్ధమవుతున్నారు. నవంబర్‌ 9న నామినేషన్లు దాఖలు చేయనున్నారు.🗳️✅


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page