చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ టైటిల్ ఇదే.. అద్భుతంగా అనౌన్స్‌మెంట్ వీడియో..
- Suresh D
- Jan 15, 2024
- 1 min read
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ గురించి బిగ్ అప్‍డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిట్ వెల్లడైంది. సంక్రాంతి సందర్భంగా నేడు (జనవరి 15) టైటిల్ ప్రకటన వచ్చింది. చిరంజీవికి ఇది 156వ మూవీ కావడంతో ఇంతకాలం ఈ ప్రాజెక్టును మెగా156గా పిలుస్తూ వచ్చారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్‍ను మూవీ యూనిట్ ఖరారు చేసింది. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభర సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.











































