లోక్ సభలో ప్రమాణం చివరలో జై పాలస్తీనా అన్న అసదుద్దీన్... తీవ్ర దుమారం
- MediaFx
- Jun 25, 2024
- 1 min read
📰 ఈరోజు లోక్ సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. ఆయన "జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా" అని నినాదాలు చేయడంతో అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.🗣️ వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. చివరలో "జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కానిస్టిట్యూషన్" అని నానాదాలు చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసి "జై హింద్, జై తెలంగాణ, జై సంవిధాన్" అని నినదించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.