top of page

🏏 షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా? 🤵‍♂️

🏏 టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రెండో పెళ్లికి రెడీ అయ్యాడా? ఇన్‌స్టాగ్రామ్‌లో షమీ పోస్టు చేసిన ఫొటోలు చేస్తే అవుననే అనిపిస్తోంది.

పెళ్లికొడుకు ముస్తాబులో, తలపాగా ధరించి మెడలో దండతో ఉన్న మూడు ఫొటోలను షమీ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. క్షణాల్లోనే అవి వైరల్ అయ్యాయి. ఈ లుక్ ఏంటని కొందరు ప్రశ్నిస్తే, పెళ్లి చేసుకుంటున్నారా సర్? అని మరికొందరు ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన భార్య హసీన్ జహాన్ కోర్టుకెక్కడం ఇటీవల సంచలనమైంది. షమీ తనతో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని, గృహహింస సహా పలు ఆరోపణలు చేస్తూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో షమీ ఇలా దర్శనమివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతమంది అభిమానులైతే షమీకి అప్పుడే విషెస్ చెప్పేస్తున్నారు. 📸👰💍

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page