చేసుకున్నాను: నటి ఖుష్బూ సుందర్
- harikrishna
- May 16, 2023
- 1 min read
Updated: May 16, 2023
సాత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటి ఖుష్బూ సుందర్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. కన్న తండ్రే తనను లైంగికంగా వేధించాడని ఆ మధ్య షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ చేసిన ఖుష్బు..

గతంలో తెలుగు, తమిళ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఖుష్బూ సుందర్ (Kushbu Sundar) ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. అంతేకాదు బీజేపీలో కీలక సభ్యురాలిగా గుర్తింపు పొందిన తను.. ఇటీవలే జాతీయ మహిళా కమిషన్‌గా సభ్యురాలిగా కూడా ఎంపికైంది. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే, ముంబైలో ముస్లిం కుటుంబంలో పుట్టిన ఖుష్బు.. 1991లో ‘చిన్న
తంబి’ సినిమా ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగినప్పటికీ లైఫ్‌లో మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కొంది. చివరకు తమిళ దర్శకుడు సి సుందర్‌ను (Sundar C) పెళ్లి చేసుకుంది. అయితే ముస్లిం అయిన ఖుష్బూ.. పెళ్లి కోసమే మతం మార్చుకుందంటూ (Kushbu Converted Religion) తనపై పలువురు చేస్తున్న విమర్శలపై తాజాగా.
‘నా పెళ్లిని ప్రశ్నించే వారు లేదా నేను నా భర్తను వివాహం చేసుకునేందుకు మతం మారానని చెప్పేవారు ఈ విషయం గురించి కాస్త తెలుసుకోండి. మన దేశంలో ఉన్న ‘ప్రత్యేక వివాహ చట్టం’ గురించి వారెప్పుడూ వినకపోవడం బాధాకరం. నేను మతం మారలేదు. అలాగే మారాలని నన్నెవరూ అడగలేదు. 23 ఏళ్ల నా వైవాహిక జీవితం.. నమ్మకం, గౌరవం, సమానత్వం, ప్రేమపై ఆధారపడింది’ అని ట్వీట్ చేసింది. కాగా ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతుండటం విశేషం
ఇదిలా ఉంటే, ఖుష్బూ నటించిన మొదటి తమిళ చిత్రంలో తనతో జంటగా నటించిన ప్రభుతో ప్రేమలో పడింది. ఆయనకు అప్పటికే పెళ్లయిందన్న విషయం తెలిసినప్పటికీ 1993లో తననే పెళ్లి చేసుకుంది ఖుష్బూ. కానీ వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రభు తండ్రి శివాజి గణేషన్ ఒప్పుకోకపోవడంతో పెళ్లయిన నాలుగు నెలలకే విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2000 సంవత్సరంలో దర్శకుడు సుందర్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ గడుపుతోంది. సినిమాల విషయానికొస్తే.. రీసెంట్‌గా గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’ చిత్రంలో జగపతిబాబుకు జంటగా కనిపించింది. అలాగే విజయ్ ‘వారసుడు’ చిత్రంలో తను నటించినప్పటికీ ఆ తర్వాత సీన్లు తొలగించారు.


Comments