మాస్ పోలీస్ అవతార్ లో కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్”
- harikrishna
- May 11, 2023
- 1 min read

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుకున్నాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా కి సంబందించిన గ్లింప్స్ వీడియో ను నేడు రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ గ్లింప్స్ వీడియో విశేషం గా ఆకట్టుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ వేరే లెవెల్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది. మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తుండగా, హరీష్ మరింత పవర్ ఫుల్ గా పవన్ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది
పవన్ కళ్యాణ్ స్వాగ్ బాగుంది. ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపొద్ది అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ డైలాగ్ గ్లింప్స్ ను వేరే లెవెల్ కి తీసుకు వెళ్లనుంది. భగత్ గా పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో నటించగా, శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.



Comments