top of page

కల్కి ప్రమోషన్స్ లో దీపికా లేకపోవడానికి కారణమేమిటి? 🌟

ree

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కల్కి2898ఏడీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాని నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీగా కల్కి 2898ఏడీ ఉంది. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో కల్కి మూవీ ఉండబోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. రీసెంట్ గా బుజ్జి విత్ భైరవ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీనిని చిత్ర యూనిట్ అందరూ వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు. అయితే దీపికా పదుకునే మాత్రం కల్కి డిజిటల్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం లేదంట. దిశా పటాని, అమితాబచ్చన్ లాంటి స్టార్స్ గ్లింప్స్ ని షేర్ చేయడంతో పాటు మూవీ విశేషాలు ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. అలాగే ఆమె నుంచి చివరిగా థియేటర్స్ లోకి వచ్చిన ఫైటర్ మూవీని ఇన్ స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రమోషన్ చేసింది. కల్కి 2898ఏడీ సినిమాలో నటించింది అని పేరుకే గాని ఒక పోస్టర్, గ్లింప్స్ కూడా ఆమె పేజీలోలో లేదని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయిన కూడా దీపికా పదుకునే కల్కి చిత్రం గురించి ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడంపై ఇండస్ట్రీలో కూడా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండటంతో విశ్రాంతి తీసుకుంటుంది. కానీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం యాక్టివ్ గానే ఉంది. మరి ఎందుకని దీపికా కల్కి 2898ఏడీ మూవీ ప్రమోషన్స్ ని ఇంత లైట్ గా తీసుకుంటుందనేది అర్ధం కానీ ప్రశ్నగా ఉంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో చేస్తోన్న కూడా దీపికా కల్కి చిత్రాన్ని పట్టించుకోకపోవడానికి ఇంకా కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

 
 
bottom of page