top of page

ఇది అట్టాంటిట్టాంటి కరోనా కాదు..వేగంగా వ్యాపిస్తున్న కేపీ.3 వేరియంట్‌.!


ree

ఇది అట్టాంటిట్టాంటి కరోనా కాదు. కరోనా ‘కింగ్‌సైజ్’. మనల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లిన కరోనా మహమ్మారి… అవతారం మార్చుకుని మళ్లీ ముంచుకొస్తోంది. లక్షలాది మందిని మంచం పట్టించి.. లక్షలాది మందిని మృత్యువుకి అప్పజెప్పిన అదే కరోనా.. మరో ఉప రకంతో ఉప్పెనై వస్తోంది. ఇది కనుక సోకిందంటే నేరుగా మరణమేనట. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. కొవిడ్​ మహమ్మారి మరో కొత్త రూపు దాల్చింది. తాజాగా కేపీ.3 అనే కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

కేపీ.3 వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ ​కొత్త వేరియంట్‌ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్‌ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. అమెరికా జూలై 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది. తాజాగా జో బైడెన్ కూడా కరోనా బారిన పడ్డారు.. ఆయనలో ఈ కరోనా కేపీ.3 వేరియంట్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. కరోనా కేపీ.3 వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. వేరియంట్‌ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

 
 
bottom of page