top of page

📊👥 సీఎం కేసీఆర్ తాజా సర్వేపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..

📋📍 సర్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యేకే ఇవ్వాళ లేక ప్రత్యామ్నాయ నేతలకు ఇవాళా అన్న కోణంలో జరుగుతున్న సర్వేలు కొలిక్కి రాబోతున్నాయి.

సిట్టింగ్‌ల్లో 50 కి పైగా ఎమ్మెల్యేలకు ఎదురు గాలి వీస్తున్నట్లు వస్తున్న సర్వేలు అధిష్టానానికి కూడా తికమక పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరికల్లా అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్ లోనే 90 కి పైగా టికెట్లు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగా ప్రగతి భవన్‌లో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

🔍📢 అయితే ఇన్నాళ్లు వామపక్షాలతో బిఆర్ఎస్ పొత్తుపై ఉన్న సస్పెన్స్ కూడా వీడినట్లు తెలుస్తోంది. మునుగోడు టిక్కెట్‌ను సీపీఐకి ఇచ్చేందుకు గులాబీ దళపతి కేసీఆర్ లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page