డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ మీద గెలిచిన టీం ఇండియా 🏏🇮🇳
- Suresh D
- Aug 19, 2023
- 1 min read
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులతో నిలిచిన సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లు ప్రకటించారు.












































