top of page

14 నెలల తర్వాత టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రోహిత్, కోహ్లీ.. 🔙🏏

ఈ సిరీస్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14 ఏళ్ల తర్వాత టీ20 క్రికెట్‌లోకి పునరాగమనం చేశారు. 2022 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇద్దరూ తమ చివరి T20 ఇంటర్నేషనల్‌ను ఆడారు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించింది . ఈ సిరీస్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14 ఏళ్ల తర్వాత టీ20 క్రికెట్‌లోకి పునరాగమనం చేశారు. 2022 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇద్దరూ తమ చివరి T20 ఇంటర్నేషనల్‌ను ఆడారు. ఆ తర్వాత ఈ ఫార్మాట్‌ కు కు దూరమయ్యారు. ఊహించినట్లుగానే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీమ్‌ఇండియాకు రోహిత్ నాయకత్వం వహిస్తాడు. ఈ జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. సెలెక్టర్ల ఈ నిర్ణయం తర్వాత వీరిద్దరూ ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ లోనూ ఆడడం దాదాపు ఖాయం. ఈ ఏడాది వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌, విరాట్‌లు ఆడతారా అనే చర్చ భారత క్రికెట్‌లో చాలా కాలంగా సాగుతోంది. దీనికి కారణం ఇద్దరూ 14 నెలల పాటు టీ20 ఇంటర్నేషనల్స్‌కి విరామం తీసుకోవడమే. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు ఇద్దరికీ టీ20 భవిష్యత్తు ఉందని సూచించినట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం, రోహిత్ T20 ప్రపంచ కప్‌లో తన పాత్ర గురించి సెలక్టర్ల నుండి క్లారిటీ కోరినట్లు చాలా మీడియా నివేదించింది. ఎందుకంటే గత టీ20 ప్రపంచకప్ తర్వాత చాలా టీ20 సిరీస్‌లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందుకే సెలక్షన్ బోర్డు ముందు రోహిత్ నుంచి సమాధానం కోరింది. తనతో పాటు విరాట్ కూడా టీ20 ప్రపంచకప్‌కు పూర్తిగా అందుబాటులో ఉన్నట్టు సెలెక్టర్లకు తెలిపాడు హిట్‌ మ్యాన్. అందువల్ల టీ20 ప్రపంచకప్‌లో నేరుగా ఆడకుండా ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు సన్నద్ధమయ్యే అవకాశం లభించింది.🔙🏏

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page