top of page

📈 పెరిగిన కూరగాయల ధరలు.. బెంబేలెత్తుతున్న వినియోగదారులు..

📅 మొన్నటి వరకు కార్తీక మాసం కావడంతో నాన్ వెజ్ ధర విపరీతంగా పడిపోయింది. దీంతో కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయి.

దానితోపాటు చలికాలం కావడంతో పంట దిగుబడి తక్కువగా ఉండడం, పంట చేతికి సరిగా అందకపోవడంతో అమాంతం ధరలు పెరగిపోయాయి. ప్రస్తుతం కిలో చిక్కుడుకాయ ధర 65 రూపాయలు పలుకగా బీన్స్ 45 రూపాయలు, దొండకాయలు 50 రూపాయలు, బెండకాయలు 60 రూపాయలు, అతి తక్కువగా అంటే టమాటో ధర కిలో 25 రూపాయలు ధర పలుకుతోంది. 6 నెలల క్రితం డబుల్‌ సెంచరీ కొట్టినటువంటి టమాటో ధర ప్రస్తుతం నేల చూపులు చూస్తుంటే మిగతా కూరగాయలు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ కన్నా కూరగాయల భోజనం ఆరోగ్యానికి ఉత్తమం అని వైద్యులు చెప్పడంతో ఎక్కువమంది కూరగాయ భోజనాన్ని తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది కూడా కూరగాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అభిప్రాయపడుతున్నారు. ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో 500 రూపాయలు పెట్టి కొన్న కనీసం సంచి కూడా నిండడం లేదని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు తగ్గితే కాస్త ఉపశమనంగా ఉంటుందని అంటున్నారు. ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం కూరగాయలు కొనాలి అంటేనే ఆలోచించాల్సి వస్తుందని వాపోతున్నారు. కానీ కొనక తప్పదంటూ ఆవేదనగా చెబుతున్నారు. 🛒

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page