top of page

మొసలికి బీపీ తెప్పిస్తే ఇట్లానే ఉంటది.. వీడియో చూస్తే సుస్సుపోసుకోవాల్సిందే


ఓ ఇద్దరు వ్యక్తులు సరస్సులో చేపలు పట్టేందుకు బోటు వేసుకుని వెళ్లారు. నీటిలోకి ఎరను వేసి.. చేపలు పడుతున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి చూసిందో.. ఆ ఎరను ఓ మొసలి గమనించింది. అటువైపు వేగంగా ఈదుకుంటూ వచ్చింది. ఈలోపు పడవలోని ఆ ఇద్దరు వ్యక్తులు.. ఎరను పైకి లాగేశారు. అసలే ఆకలి మీదుంది.? ఆపై ఎరను లాగేసుకుని మొసలికి బీపీ తెప్పించారు. దీంతో పడవ వైపునకు దూసుకొచ్చిన మొసలి.. ఒక్క ఉదుటున బోటు ఎక్కేందుకు ప్రయత్నించింది.

దీంతో అందులోని వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అటు మొసలి కూడా బెదిరినట్టు ఉంది.. ఇక ఏం చేసేదిలేక.. నీటిలోనే అలా ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు దడుసుకోవడమే కాకుండా.. హడలిపోయాడు. మొసలికి కోపం తెప్పిస్తే.. ఇంతే మరి అనుకుంటూ.. కామెంట్స్ పెట్టారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page