top of page

సింహాలకు సుస్సుపోయించిన అడవి దున్న..వీడియో చూస్తే


ఆహారం కోసం వెతుకుతున్న కొన్ని సింహాలకు.. అటుగా వెళ్తున్న ఓ పెద్ద అడవి దున్న కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా దాన్ని సింహాలన్ని చుట్టుముడుతాయి. ఇక ఆ సింహాలు తనను ఎటాక్ చేస్తాయని అలెర్ట్ అయిన అడవి దున్న.. ఒక్కసారిగా పరుగులు పెట్టింది. సింహాలు పట్టుకునేందుకు పంజా విసిరినా.. దాన్ని తప్పించుకుని ఒక్కసారిగా గాల్లోకి జంప్ చేసింది. వాటికి దొరక్కకుండా ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది. నీటిలోకి దూకి పరుగుపెట్టి.. కళ్లు మూసి తెరిచేలోపు అక్కడ నుంచి పారిపోతుంది. దీంతో సింహాలన్నింటికి చివరికి చావుదెబ్బ తగిలింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఒలింపిక్స్‌కి పంపితే.. అడవి దున్నకు గోల్డ్ మెడల్కన్ఫర్మ్ అంటూ’ ఒకరు కామెంట్ చేస్తే.. ‘వామ్మో.! అడవి దున్న వేగం మాములుగా లేదుగా’ అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page