top of page

🍀 నేడే లిక్కర్ షాప్‌ల లక్కీ డ్రా.. లక్కున్నోళ్లకే మందు లైసెన్సులు! 🌟

🏢 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2,620 లిక్కర్ షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. 🎉 ఇందులో పేర్లు వచ్చిన వారికి రెండేళ్లపాటు లైసెన్సులు మంజూరు చేస్తారు. 🗓️

ree

ఆగస్టు 4 నుంచి ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ ఆసగ్టు 18 తో ముగిసిన సంగతి తెలిసిందే. 💼 ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం దుకాణాలకు కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 15,894 దరకాస్తులు వచ్చిపడ్డాయి. 🏬 రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాపులకు 21,615 దరఖాస్తులు వచ్చాయి. 🍻 సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోని 134 మద్యం షాపులకు 10,994 దరఖాస్తులు, శంషాబాద్‌ ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోని 100 మద్యం షాపులకు 10,621 దరఖాస్తులు.. 👮‍♂️ ఇలా ఏ జిల్లాలో చూసినా రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 📜 మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,31,493 దరఖాస్తులు వచ్చిపడ్డాయి.

🕙 ఇక ఈ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న లక్కీ డ్రా కార్యక్రమానికి ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. 🎟️ లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 🚫🏛️

 
 
bottom of page