పేరుకే మ్యాంగో జ్యూస్.. తాయారు చేసే విధానం చూస్తే.. బిత్తరపోతారు..!
- MediaFx

- Aug 31, 2024
- 1 min read
మాంగో జ్యూస్…ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌లతో ప్రముఖుల బ్రాండెడ్ కంపెనీల ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లో ఎన్నో విధాలుగా అమ్ముడవుతున్నాయి. అయితే, నిజంగానే మార్కెట్లో లభించే మ్యాంగో జ్యూస్‌ను మామిడి పండ్ల నుంచే తయారు చేస్తారని మీరు నిజంగా నమ్ముతున్నారా..? ఇన్‌స్టాగ్రామ్‌లోని కంటెంట్ క్రియేటర్ ఒకరు దీనికి సమాదానం ఇచ్చారు.. మ్యాంగో జ్యూస్ ప్రాసెసింగ్ ప్లాంట్ నుండి రికార్డ్ చేసిన ఒక షాకింగ్ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. కాగా, ఇప్పుడా వీడియో నెటిజన్లను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వైరల్ వీడియోలో పసుపు రంగులో ఉండే ఏదో ద్రవ పదార్థాన్ని ఎరుపు, ఆరెంజ్ ఫుడ్ కలరింగ్, షుగర్ సిరప్, ఇతర కెమికల్స్‌తో కలుపుతున్నారు. ఆ తరువాత ప్రాసెస్ చేయబడిన ద్రవాన్ని ప్లాస్టిక్ బక్కెట్లతో ఎత్తుతున్నారు. ఇలా ఎత్తిన ద్రవాన్ని ఆయా సైజులను బట్టి టెట్రా ప్యాకెట్లు, సీసాలు, పెద్ద పెద్ద డబ్బాలలో నింపుతున్నారు. ఇక్కడ అనేక మంది కార్మికులు, పెద్ద పెద్ద యంత్రాలు పనిచేస్తున్నాయి. వారంతా ఇలా తయారైన జ్యూస్‌ని మార్కెట్లోకి డెలివరీ చేయడానికి సిద్ధం చేశారు..చూశారు మనం ఎంతో ఇష్టంగా తాగే మ్యాంగో జ్యూస్ ఎలా తయారైందో..ఇక వీడియోను పోస్ట్ చేస్తూ..దీనికి “టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్” అనే క్యాప్షన్ రాశారు. వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్ యూజర్లు విపరీతంగా చూస్తున్నారు. మ్యాంగో జ్యూస్ మొత్తం తయారీ, ప్యాకేజింగ్ తీరును చూసిన తర్వాత వారిలో నిరాశ కట్టలు తెంచుకుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. బాబోయ్ ఇదేం జ్యూస్ తయారీ అంటూ భయాందోళన వ్యక్తం చేశారు.












































