top of page

🌧️⚠️🌊🇮🇳 ఇకపై భారీ నుంచి అతిభారీ వర్షాలు..

🌧️🌊 రాబోయే 48గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, ములుగు జిల్లాల్లో వర్షం దంచి కొడుతోంది. 🌧️⚠️ హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలో గత 24గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల్లో జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. బుధవారం రాత్రి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌ జామ్ అయింది. 🌧️⚡️ హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్రమైన గాలులకు చెట్లు బంజారాహిల్స్‌లో ఓ చెట్టుకొమ్మ విరిగి కరెంట్ పోల్‌పై పడింది. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం కలగలేదు. ⛈️🏙️🚦



 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page