top of page

నిప్పులు కురిపిస్తున్న భానుడు.. వడదెబ్బతో ఒక్కరోజులోనే ఐదుగురు మృతి


తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భగ భగ మండే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలతో పాటు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈ సమయంలో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 29) నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 45.1 డిగ్రీల సెల్సియస్, నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం తిమ్మాపురంలో 45.1 డిగ్రీల సెల్సియస్, మాడుగులపల్లిలో 45 డిగ్రీలు, త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 44.9 డిగ్రీలు ఎండతీవ్రత నమోదైంది. ఖమ్మం, గద్వాల, నిజామాబాద్‌, మంచిర్యాల, సూర్యాపేట, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలో నేటి నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని సూచించింది.ఇక తీవ్రమెన ఎండలతో వడదెబ్బకు గురై ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page