top of page

🍽️ భోజనం తర్వాత చేయకూడని తప్పులు.. 🍽️

🍵 టీ: టీ తాగడం వల్ల నరాలు ఉత్తేజితమై కొత్త శక్తి లభించినట్లు ఉంటుంది. అయితే భోజనం తర్వాత టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ☕🍽️

🚿 స్నానం: స్నానం చేయడం వల్ల శరీరంలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. అయితే స్నానం తర్వాత భోజనం చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి. ఇంకా మెదడుకు మత్తు అనుభూతి కలుగుతుంది. 🚿🍽️

🍛 పండ్లు: అరటి, మామిడి వంటి పండ్లను కొందరు భోజనం సమయంలోనే తీసుకుంటారు. అలా చేయడం వల్ల కూడా జీర్ణ సమస్యలు కలుగుతాయి. భోజనం, పండ్లు జీర్ణమయ్యే వేగం వేర్వేరుగా ఉంటుంది. ఈ కారణంగానే భోజనం తర్వాత పండ్లను తీసుకోకూడదు. భోజనం తర్వాత కనీసం రెండు గంటల సమయం అయినా ఆగి తీసుకోవాలి. 🍛🍽️

🚬 ధూమపానం: ధూమపానం ఏ సమయంలో అయినా ఆరోగ్యానికి హానికరమే. అయితే అలవాటు ఉన్నవారు భోజనం తర్వాత ధూమపానం చేస్తే అది మరింత ప్రాణాంతకం. ఎందుకంటే తిన్న తర్వాత ఒక సిగరెట్ కాలిస్తే 10 సిగరెట్లు తాగడంతో సమానమని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఊపిరితిత్తులు, గుండె త్వరగా ప్రభావితం అవుతాయి, కనుక భోజనం తర్వాత ధూమపానం చేయకండి. 🚬🍽️

💧 నీరు: భోజనం తర్వాత కనీసం అరగంట వరకు నీరు కూడా తాగకూడదు. నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడి, ఆహారం జీర్ణం కాకుండా పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ఫలితంగా అవి మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోయి, శరీరంలో పోషక లోపం ఏర్పడే పరిస్థితి ఎదురవుతుంది. 💧🍽️


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page