top of page

🧠 బ్రెయిన్‌ స్ట్రోక్‌ శీతాకాలంలోనే ఎందుకు వస్తుందో తెలుసా? 🤔

చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ జాబితాలో గుండె సమస్యల నుంచి స్ట్రోకులు వరకు ఉన్నాయి. ఇవేకాకుండా ఛాతీ కఫం న్యుమోనియా సంభావ్యతను పెంచుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ సమస్య తలెత్తుతుంది.

దాదాపు అన్ని హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్‌లు బ్రెయిన్ స్ట్రోక్ రోగులు ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కాలంలో రక్తపోటును అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో బ్రెయిన్ డెత్ సంఖ్య మరింత పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఎందుకు పెరుగుతోంది? ఉష్ణోగ్రత 15 కంటే తక్కువగా ఉన్నప్పుడు కొన్ని శారీరక మార్పులు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాంటప్పుడు రక్తపోటు పెరుగుతుంది. దీంతో ప్రమాదం ప్రారంభమవుతుంది.

చాలా మందికి ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అందుకే షుగర్-ప్రెజర్-కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్లు రక్తపోటు తగ్గినప్పుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి వారికి రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే అది సమస్యగా మారుతుంది. 🩸💡

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page