‘హరిహర వీరమల్లు’ టీజర్ కి తేదీ సమయం ఖరారు
- MediaFx

- Apr 30, 2024
- 1 min read
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PawanKalyan) హీరోగా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. ఒక టైం లో అయితే ఇది పవన్ కెరీర్ లోనే పీక్ అంచనాలు అందుకున్న సినిమాగా నిలిచింది. అయితే అలా సమయం గడవడం షూట్ కూడా వాయిదా పడుతూ వస్తుండడంతో ఆలస్యం అవుతున్న ఈ చిత్రం పై అప్డేట్స్ మాత్రం మేకర్స్ అందిస్తున్నారు. అలా గత కొంత కాలం ఎప్పుడో కన్ఫర్మ్ చేసిన టీజర్ (Hari Hara Veeramallu Teaser) ని ఇపుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ మే 2న ఉదయం 9 గంటలకి వీరమల్లు అవైటెడ్ ట్రీట్ వస్తున్నట్టుగా ఇప్పుడు సరికొత్త పాన్ ఇండియా పోస్టర్ లతో రివీల్ చేశారు. మొత్తానికి అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ లో చాలా మందికి పర్శనల్ ఫేవరెట్ అయ్యిన ఈ సినిమా నుంచి గ్రాండ్ ట్రీట్ రాబోతుంది అని చెప్పాలి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్,పవర్ గ్లాన్స్ లకి అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాలో బాబీ డియోల్ (Bobby Deol) తదితర బాలీవుడ్ నటులు కూడా కనిపించనుండగా ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.




Comments